TG: బతుకమ్మ పండుగలో అతి ముఖ్యమైనది బొడ్డెమ్మ పండుగ. కొన్ని ప్రాంతాలలో అమావాస్యకు ఐదురోజుల ముందు బహుళ దశమి తిథి నుంచి.. మరికొన్ని ప్రాంతాల్లో 9 రోజుల ముందు నుంచి బొడ్డెమ్మను పేర్చుకుంటారు. బతుకమ్మ బిడ్డ బొడ్డెమ్మ అని భక్తుల విశ్వాసం. అందుకే ఇది ఆడబిడ్డలకు ప్రత్యేకం. బాలికలు, పెళ్లి కాని అమ్మాయిలు బొడ్డెమ్మ ఆడుతారు. ఇప్పటికే పల్లెల్లో బొడ్డెమ్మ పండుగ సంబరాలు మొదలు కాగా.. అక్టోబరు 2 నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం అవుతుంది.