తిరుమల శ్రీవారి భక్తులకు TTD కీలక ప్రకటన చేసింది. ఈనెల 31న VIP బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు ప్రకటనలో తెలిపింది. దీపావళి ఆస్థానం దృష్ట్యా VIP బ్రేక్ దర్శనాల రద్దు చేయాలని నిర్ణయించింది. ప్రొటోకాల్ ప్రముఖలు మినహా.. సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశామని, 30న సిఫారసు లేఖలు స్వీకరించబోమని అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని భక్తులకు తితిదే విజ్ఞప్తి చేసింది.