గుజరాత్‌లోని పాటన్‌లో 5 టన్నుల ఎర్రచందనం దుంగలను ఏపీ టాస్క్‌ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 155 ఎర్రచందనం దుంగలను పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. గుజరాత్ పోలీసుల సాయంతో దుంగలను అక్రమ రవాణా చేస్తున్న ముఠాకు సంబంధించిన ముగ్గురు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. ఈ ఎర్రచందనం విలువ రూ. 10 కోట్లు ఉంటుందని అంచనా.
ATP: అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం గుర్రబాడు గ్రామంలో శుక్రవారం ప్రమాదవశాత్తు ఇంట్లో వంట చేస్తుండగా చీరకు నిప్పంటుకొని లక్ష్మీ అనే వివాహితకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యుల సూచనలు మేరకు మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
AP: శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం సరిహద్దు ప్రాంతం పట్టుపురం వద్ద నకిలీ కరెన్సీ నోట్లు మార్పు చేస్తున్న వారిని పోలీసులు పట్టుకున్నారు. ఈ క్రమంలోనే దర్యాప్తు చేపట్టి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం రూ.57.25 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిలో ఒకరు వైసీపీ ఎంపీటీసీ కరజాడ గ్రామానికి చెందిన దాసర రవికుమార్ అని తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
BPT: బాపట్ల పట్టణం శ్రీనివాస నగర్ ఫస్ట్ లైన్ పబ్లిక్ స్కూల్ దగ్గరలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. కర్లపాలెం వైపు నుంచి బాపట్ల వస్తున్న ఆటో ప్రమాదవశాత్తు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు ఏరియా వైద్యశాలకు తరలించారు. కాగా, ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
SRD: జహీరాబాద్ నియోజకవర్గంలో గల తెలంగాణ రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం కేంద్ర ప్రభుత్వం పరిధి ప్రత్యేక అధికారుల బృందం భారీ ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఎన్టీఆర్: నందిగామ బైపాస్ దగ్గర భారీగా గుంతలు ఉండటం వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. శుక్రవారం ఉదయం ఒక కారు ముందున్న కారును ఢీకొట్టడం వల్ల ముందున్న కారు స్వల్పంగా ధ్వంసం అయింది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. రహదారిని మరమ్మతులు చేయవలసిందిగా స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.
KKD: రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని 2020లో జరిగిన ఓ హత్య కేసులో కోర్టు ముద్దాయికి జీవిత ఖైదు విధించింది. రాజమండ్రి రూరల్ కొంతమూరుకు చెందిన కనకదుర్గను హత్య చేసిన కేసులో నరసింహరాజును ముద్దాయిగా కోర్టు నిర్ధారించింది. సాక్షుల విచారణ అనంతరం జడ్జి విజయ్ గౌతమ్ ముద్దాయిపై నేరం రుజువు కావటంతో జీవిత ఖైదుతోపాటు, రూ.2 వేలు జరిమానా విధించారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని బాల్య తండాలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో అనిత(27) అనే మహిళ గురువారం రాత్రి మృతి చెందింది. తండాలో ఉన్న గృహాలకు షార్ట్ సర్క్యూట్ కావడంతో తండావాసులు భయభ్రాంతులకు గురి అయి పరుగులు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు.
MDK: జిల్లా తూప్రాన్ పట్టణంలో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తూప్రాన్‌లో జరిగిన జన్మదిన వేడుకలకు శివంపేటకు చెందిన ఈసుగారి అరుణ్ అలియాస్ బబ్లు(18), మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేటకు చెందిన శ్రీనివాస్ గౌడ్, పాలాట గ్రామానికి చెందిన మహేందర్ హాజరయ్యారు. వీరు వెళ్తున్న బైక్‌ను మరో వాహనం ఢీకొనడంతో అరుణ్ చనిపోయాడు.
BDK: 9వ మైలు తండా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో RMP వైద్యుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. కిష్టారానికి చెందిన లక్ష్మణ్ గురువారం రాత్రి ఇల్లందు నుంచి వెళ్తుండగా బైక్ అదుపుతప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో RMP తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
GDL: ఐజ పట్టణంలో శుక్రవారం కొత్త బస్టాండ్ ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యుత్ లైన్ మెన్ కృష్ణయ్య గాయాలపాలయ్యాడు. కృష్ణయ్య ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఆర్టీసీ బస్సు వెనక టైరు ఆయనపైకి ఎక్కింది. దీంతో కాలు నుజ్జు నుజ్జు అయింది. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
RR: భర్త వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మియాపూర్‌లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఏపీలోని ఏలూరు జిల్లాకు చెందిన నాగలక్ష్మికి మనోజ్ అనే వ్యక్తితో ఇటీవల వివాహమైంది. కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండటంతో నాగలక్ష్మి బుధవారం ఆన్లైన్లో విషం తెప్పించుకొని తాగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయింది.
ఛత్తీస్గ్ఢ్లో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో రెండు 12-బోర్ తుపాకులు, పేలుడు పదార్థాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆయన ...
సంగారెడ్డి జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. మొగుడంపల్లి మండలం మాడిగి అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద తనిఖీల్లో లారీలో తరలిస్తున్న డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు. పట్టుబడిన మాదక ద్రవ్యాల విలువ రూ.50 కోట్లు విలువ ఉంటుందని సమాచారం. వీటిని ఏపీలోని ఓడరేవు నుంచి ముంబయి తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
NZB: నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని వీరన్నగుట్టలో ఓ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై ఆమె బంధువులు, స్థానికులు దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన అతడు చికిత్స పొందుతూ మృతిచెందగా శుక్రవారం ఉదయం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆ గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.