• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

దొంగ నోట్ల ముఠా అరెస్ట్

TG: కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడలో అంతర్రాష్ట్ర దొంగ నోట్ల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కామారెడ్డి ఎస్పీ 8 మంది సభ్యులను ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ. 56.90 లక్షల 500 రూపాయల నోట్లు, కంప్యూటర్, కలర్‌ప్రింటర్, కలర్స్, రిబ్బన్ స్వాధీనం చేసుకున్నారు.

December 14, 2024 / 05:27 PM IST

భూతగాదాలతో వ్యక్తి హత్య

BHPL: కాటారం మండలం దేవరాంపల్లిలో దారుణం చోటుచేసుకుంది. భూతగాదాలతో అన్నపై తమ్ముడి కుటుంబీకులు దాడిచేసి, గొడ్డలితో నరికి హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సారయ్య(55) తన కొడుకుతో కలిసి బైక్‌పై వెళుతుండగా తమ్ముడి కుటుంబ సభ్యులు గొడ్డలితో నరికి చంపారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

December 14, 2024 / 05:20 PM IST

భార్యతో గొడవ పడి భర్త ఆత్మహత్యాయత్నం

ELR: నూజివీడు మండలం పల్లెర్లమోడీ గ్రామంలో భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాజేష్(37) అనే వ్యక్తి భార్యతో కుటుంబ తగాదాల విషయమై గొడవపడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మందు సేవించినట్లుగా ఏఎస్ఐ శేఖర్ కు వాంగ్మూలం ఇచ్చాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

December 14, 2024 / 05:17 PM IST

ఘోర రోడ్డు ప్రమాదం.. యువతి స్పాట్ డెడ్

TPT: శ్రీకాళహస్తి పట్టణం వీఎం పల్లి వద్ద వంతెనపై లారీ చక్రాల కింద పడి శనివారం యువతి మృతి చెందింది. తిరుపతి నుంచి నాయుడుపేట వైపు వెళ్తున్న లారీని తిరుపతి నుంచి నెల్లూరుకు బైక్‌పై వెళ్తున్న నెల్లూరుకు చెందిన హేమలత (22) ఒవర్టేక్ చేసింది. ఈ క్రమంలో ఆమె బ్యాగు లారీకి తగిలి లారీ చక్రాల కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

December 14, 2024 / 04:39 PM IST

ఉరేసుకుని వృద్ధురాలు ఆత్మహత్య

WGL: ఓ వృద్ధురాలు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం రాయపర్తి మండలం శివరాం తండాలో చోటుచేసుకుంది. బానోత్ హంసి అనే వృద్ధురాలు మనోవేదనతో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాయపర్తి ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపారు.

December 14, 2024 / 03:38 PM IST

ముమ్మిడివరంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

కోనసీమ: ముమ్మిడివరంలో ఒక బేకరీలో పనిచేస్తున్న బెంగళూరుకు చెందిన చేతన్ గౌడ్ (19) అనే వ్యక్తి శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. శుక్రవారం రాత్రి బేకరీ నుంచి రూమ్‌కి వెళ్లి నిద్రించిన చేతన్ ఉదయం లేవలేదు. తోటి వారు నిద్ర లేపేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

December 14, 2024 / 02:52 PM IST

పేరంపేటలో త్రాచు పాము కలకలం

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట గ్రామంలో శనివారం తెల్ల తాచుపాము జనావాసాల్లో హల్ చల్ చేసింది. గ్రామానికి చెందిన కడిమి గోపి ఇంట్లోకి పాము ప్రవేశించడంతో ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ సేవియర్ సొసైటీ అధ్యక్షుడు చదలవాడ క్రాంతికి సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అనంతరం చాకచక్యంగా పామును పట్టుకున్నారు.

December 14, 2024 / 02:24 PM IST

వ్యాన్ బోల్తా.. వ్యక్తి మృతి

E.G: రంపచోడవరం ఏజెన్సీ వీరవరం గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. రాజమండ్రి నుంచి కుంట ప్రాంతానికి యాపిల్ లోడుతో వెళ్తున్న ఐచర్ అదుపుతప్పి కల్వర్ట్‌లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో చంద్రారావు అనే వ్యక్తి మృతి చెందగా… డ్రైవర్‌కు తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. మంచు కురుస్తున్న కారణంగా వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని పోలీసులు సూచించారు.

December 14, 2024 / 02:20 PM IST

ఆర్టీసీ బస్సు కింద పడి వృద్ధురాలు మృతి

WGL: ఆర్టీసీ బస్సు కింద పడి ఓ వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కన్నాయిగూడెం మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. దేవాదుల గ్రామానికి చెందిన చిలుముల లక్ష్మీ (70) బుట్టాయిగూడెంలోని ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సును ఎక్కుతుండగా బస్సు బయదేరింది. ఈ క్రమంలో వృద్ధురాలు బస్సు కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది.

December 14, 2024 / 02:03 PM IST

రైతు ఇంట్లో షార్ట్ సర్క్యూట్.. ఇల్లు దగ్ధం

ASF: బెజ్జుర్ మండలంలోని అందుగుల గూడా గ్రామ రైతు కోరేత ప్రవీణ్ కుమార్ ఇంట్లో శనివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుంది. ప్రవీణ్ వ్యవసాయ పనుల నిమిత్తం చేనుకు వెళ్లగా కరెంట్ షార్ట్ సర్కుట్‌తో ఇల్లు, 10 క్వింటాళ్ల పత్తి, బీరువాలు, సర్టిఫికెట్లు ఖాళీ బూడిద అయ్యాయి. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు వేడుకున్నాడు.

December 14, 2024 / 01:45 PM IST

200 కిలోల గంజాయితో వ్యక్తి అరెస్టు

ASR: జీ.మాడుగుల మండలం గొందిపల్లి గ్రామంలో 200కిలోల గంజాయి పట్టుబడిందని సీఐ సన్యాసినాయుడు, ఎస్సై అప్పలరాజు శనివారం తెలిపారు. తమ సిబ్బందితో కలిసి, గ్రామానికి చెందిన తెరువాడ చిరంజీవి అనే వ్యక్తి ఇంటి పక్కన ఉన్న పసుపుదొడ్డిలో తనిఖీలు చేయగా, అక్కడ నిల్వ ఉంచిన గంజాయి పట్టుబడిందన్నారు. గంజాయిని స్వాధీనం చేసుకుని, చిరంజీవిని అరెస్టు చేశామన్నారు.

December 14, 2024 / 01:08 PM IST

దుకాణాన్ని ఢీకొట్టిన కారు

ELR: జంగారెడ్డిగూడెం మండలం వేగవరం జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అశ్వరావుపేట వైపు నుండి వస్తూన్న ఒక కారు అదుపుతప్పి జాతీయ రహదారి పక్కన ఉన్న దుకాణాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్నవారు సురక్షితంగా ఉన్నారు. నిద్రమత్తు కారణంగా ఈ ఘటన జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు.

December 14, 2024 / 12:22 PM IST

చిట్యాల లో మృతదేహం లభ్యం

NLG: నల్లగొండ జిల్లా చిట్యాల రైల్వే స్టేషన్ సమీపంలోని వ్యవసాయ పొలంలో శనివారం మృతదేహం కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడు హైదరాబాద్‌కు చెందిన గవర్నమెంట్ ఆఫీసర్ ప్రసాద్‌గా గుర్తించారు. మృతదేహంపై గాయాలు ఉండడంతో ప్రసాద్‌ను ఎక్కడో హత్య కేసు మృతదేహాన్ని ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

December 14, 2024 / 12:22 PM IST

హంద్రీనీవా కాలువలో గల్లంతైన యువకుడు

ATP: గుంతకల్లు పట్టణ శివారులోని హంద్రీనీవా కాలువలో స్నానానికి వెళ్లి ఆది కేశవరెడ్డి అనే యువకుడు గల్లంతయ్యాడు. అక్కడే ఉన్న స్థానికులు సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న అధికారులు హంద్రీనీవా కాలువలో యువకుడు గల్లంతైన ప్రాంతాన్ని గాలింపు చర్యలు చేపట్టారు.

December 14, 2024 / 12:03 PM IST

యువతిపై సామూహిక అత్యాచారం.. అరెస్ట్

సామూహిక అత్యాచారం కేసులో ఎనిమిది మంది నిందితులు అరెస్ట్ అయ్యారు. నవంబర్ 17న గువాహటీలోని ఓ ఆలయ పరిసరాల్లో యువతిపై కొందరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను ఫోన్‌లో రికార్డు చేయగా.. తాజాగా అవి వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ఆ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో.. 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు. అయితే బాధితురాలు ఎవరనే విషయం ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.

December 14, 2024 / 11:44 AM IST