• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

ASR: చింతూరు మండలం వీరాపురం వద్ద శనివారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చింతూరు వైపు నుంచి కుంట వైపుకు ఫ్రూట్ లోడుతో వెళ్తున్న వ్యాన్ బోల్తా కొట్టింది. వ్యానులో ముగ్గురు ఉండగా.. వీరిలో తీవ్ర గాయాలైన ఒకరు మృతి చెందినట్టు సమాచారం. ఘటనపై చింతూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

December 14, 2024 / 10:27 AM IST

రామభద్రపురంలో రెండు బొలెరోలు ఢీ

VZM: రామభద్రపురం మండలంలో శనివారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. పాలవలస సమీపంలో ప్రధాన రహదారిపై రెండు బొలెరోలు ఢీకొన్నాయి. డ్రైవర్లు ఇద్దరూ ప్రమాదం నుంచి సురక్షితంగా భయపటపడ్డారు. కూరగాయలు తరలిస్తుండగా ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

December 14, 2024 / 10:04 AM IST

తిర్లంగిలో భార్యాభర్తల పై హత్యాయత్నం

SKLM: టెక్కలి మండలం తిర్లంగి గ్రామానికి చెందిన పిట్ట రాజేశ్వరి, పిట్ట రామ్మోహన్ అనే భార్యభర్తలపై శనివారం ఉదయం ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేశారు. ఆస్తితగాదాల నేపథ్యంలో భార్యాభర్తలపై దాడి జరిగినట్లు గ్రామస్థులు తెలిపారు. గాయపడిన భార్యాభర్తలను టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

December 14, 2024 / 08:21 AM IST

హైవేపై అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం

SKLM: మందస మండలం మకరజోల గ్రామ సమీప జాతీయ రహదారిపై అర్ధరాత్రి దాటినవేళ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీను వెనుక నుంచి మరో లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ క్లీనర్ క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన వాహనాలను సురక్షిత ప్రాంతానికి తరలించారు.

December 14, 2024 / 08:13 AM IST

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు

ATP: గుత్తి పట్టణంలోని రాజీవ్ గాంధీ సర్కిల్‌లో ద్విచక్ర వాహనం డివైడెర్‌ను ఢీకొని అదుపుతప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులకి తీవ్రగాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు.

December 14, 2024 / 07:40 AM IST

తాళం పగలగొట్టి ఇంట్లోని బంగారం చోరీ

VZM: రాజాం పట్టణం ఈశ్వర నారాయణ కాలనీలో అమరాన సత్యనారాయణ ఇంట్లో ఈరోజు చోరీ జరిగింది. ఇంటి తాళం విరగొట్టి బీరువాలోని సుమారు 20తులాల బంగారం వస్తువులు అపహరణకు గురైనట్లు యజమానులు గుర్తించారు. రూరల్ సీఐ ఉపేంద్ర ఘటనా స్థలానికి చేరుకొని ఇంటి లోపల, పరిసరాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

December 14, 2024 / 07:33 AM IST

ఎస్.కోట ముంతాజ్ హోటల్‌లో అగ్నిప్రమాదం

VZM: శృంగవరపుకోట ముంతాజ్ హోటల్‌లో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. వంట గదిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. హోటల్‌లో మూడో ఫ్లోర్‌ను పొగ కమ్మేయడంతో సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసి సహాయక చర్యలు చేపట్టారు.

December 14, 2024 / 07:30 AM IST

నిప్పంటుకొని మహిళకు తీవ్ర గాయాలు

ATP: గుంతకల్లు మండలం గుర్రబాడు గ్రామంలో శుక్రవారం ప్రమాదవశాత్తు ఇంట్లో వంట చేస్తుండగా చీరకు నిప్పంటుకొని లక్ష్మీ అనే వివాహితకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యుల సూచనలు మేరకు మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

December 14, 2024 / 07:21 AM IST

ఒంగోలులో పదినెలల బాలుడు కిడ్నాప్

ఒంగోలు నగరంలోని ప్రగతినగర్‌లో పది నెలల బాలుడిని ఓ మహిళ కిడ్నాప్ చేసింది. ఒడిశాకు చెందిన ప్రదీప్ సునానీ మూడేళ్లుగా ఒంగోలు కార్ కేర్లో పనిచేస్తున్నాడు.‌ ప్రగతినగర్‌లో ఉంటున్న అతని కుమారుడు మహీర్‌ను పక్కింట్లో ఉంటున్న దయామణి తీసుకెళ్లి తీసుకురాలేదు. దీంతో తల్లిదండ్రులు వెతకగా ఎవరూ కనిపించలేదు. దీంతో తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు

December 14, 2024 / 07:04 AM IST

పేకాట స్థావరంపై దాడి.. నగదు స్వాధీనం

ప్రకాశం: మార్టూరు మండల పరిధిలోని రాజుపాలెం- విజయనగర్ కాలనీ మధ్యలో గుట్టు చప్పుడు కాకుండా పేకాట నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారంతో మార్టూరు సీఐ శేషగిరిరావు శుక్రవారం దాడి చేశారు. ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.72వేలు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు.

December 14, 2024 / 06:55 AM IST

అతి కిరాతకంగా తల్లిదండ్రులను చంపిన కుమారుడు

కన్న తల్లిదండ్రులను కుమారుడు అతి కిరాతకంగా హత్య చేసిన ఉదంతం బాపట్ల మండలంలో చోటుచేసుకుంది. అప్పికట్లలో విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు విజయ భాస్కరరావు దంపతులు జీవిస్తున్నారు. గత అర్థరాత్రి సమయంలో ఈ దంపతులపై వారి కుమారుడు బలమైన ఆయుధంతో దాడి చేసి చంపేశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు పట్టించారు. అయితే ఈ హత్యలకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

December 14, 2024 / 05:20 AM IST

మనుబోలు పోలీసు స్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాదం

NLR: మనుబోలు మండల కేంద్రమైన మనుబోలు పోలీస్ స్టేషన్ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పదిమందికి పైగా గాయాలయ్యాయి. చిత్తూరు జిల్లా పలమనేరు వాసులు ఓ టూరిస్ట్ బస్సులో తీర్థయాత్రలకు వెళ్లి తిరిగి సొంత ఊరికి వెళుతుండగా ముందు వెళ్తున్న వాహనం ఆగడంతో బస్ డ్రైవర్ సడన్గా బ్రేక్ వేశాడు. దీంతో నెల్లూరు నుంచి చెన్నై వెళ్తున్న లారీ వేగంగా ఢీ కొట్టింది.

December 14, 2024 / 04:25 AM IST

వినుకొండలో రైలు కిందపడి ఆత్మహత్య

PLD: డోన్ వైపు వెళుతున్న రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. శుక్రవారం వినుకొండ – చీకటిగలపాలెం రైల్వేస్టేషన్ మధ్య డోన్ వైపు వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. మృతుడు నిండు చేతులు చొక్కా, లుంగీ ధరించి ఉన్నాడన్నారు. చొక్కా మీద ఈధర్ అనే గ్రామం పేరు ఉన్నట్లు చెప్పారు.

December 14, 2024 / 04:10 AM IST

చెరుకుపల్లిలో యువకుడి అదృశ్యం

బాపట్ల: చెరుకుపల్లి మండలం నడింపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి అదృశ్యంపై చెరుకుపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. చెరుకుపల్లిలో గ్లోబల్ కంప్యూటర్స్ అండ్ మొబైల్స్ వ్యాపారం చేస్తున్న షేక్ మహమ్మద్ ఖాసీం వలీ ఈనెల 2న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని ఖాసీం తల్లి షేక్ కరిమున్నీసా శుక్రవారం చెరుకుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

December 14, 2024 / 04:04 AM IST

800 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం

TG: మెదక్ జిల్లా మాడిగి RTA చెక్‌పోస్ట్ వద్ద 800 క్వింటాళ్ల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ముంబైకి లారీలో తరలిస్తున్న గంజాయిని పూణె, గోవా రాష్ట్రాలకు చెందిన DRI స్పెషల్‌ఫోర్స్ అధికారులు వెంబడించగా..లారీ డ్రైవర్.. చెక్‌పోస్ట్ వద్ద వాహనాన్ని వదిలి పారిపోయాడు. డ్రైవర్ ఎంతసేపటికి రాకపోవడంతో లారీని పరిశీలించగా గంజాయి విషయం బయటపడింది. వెంటనే గంజాయిని ఇరు రాష్ట్రాల అధికారులు సంయుక్తంగ...

December 14, 2024 / 02:42 AM IST