Delhi a man could not bear the cold and lit a fire next to it and died
Fire accident: దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లోని మంగళపురిలో ఓ ఘటన అందరిని కలిచివేసింది. ఒక వ్యక్తి చలిని తట్టుకోలేక ఇంట్లో నిప్పుల కుంపటి రాజేశాడు. తరువాత ఇంట్లో వెచ్చదనం కోసం అలాగే మండనిస్తూ దాని పక్కనే దుప్పటి కప్పుకొని నిద్రపోయాడు. ప్రమాదవశాత్తు తాను కప్పుకున్న దుప్పటిపై నిప్పులు(Fire) పడి మంటలు వ్యాపించాయి. తాను తేరుకునేలోపే మంటలు ఎక్కువయ్యాయి. ఈ ఘటనలో సదరు వ్యక్తి మరణించాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గడీ లోపలి నుంచి వేసి ఉండటంతో తలుపులు పగలగొట్టారు. ఇళ్లంతా పొగతో నిండి ఉంది. కొద్ది సమయం తరువాత చూస్తే ఇంట్లో శవం కనిపించింది. బాడీని పోస్ట్ మార్టానికి పంపించి దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల కథనం ప్రకారం.. అంగన్ వాడీ వలీ ప్రాంతంలో ఓ వ్యక్తి బౌన్సర్‌గా పనిచేస్తున్నాడు. ఢిల్లీ ప్రాంతం అంతా విపరీతమైన చలిగా ఉంటుంది. దాంతో ఆ వ్యక్తి ఇంటికి వచ్చే సరికి ఆలస్యం అయ్యింది. చలిని తాళలేక సదరు వ్యక్తి ఇంట్లో బొగ్గులతో నిప్పు ముట్టించాడు. అలా చలి కాచుకుంటూ దాని పక్కనే నిద్రపోయాడు. దాంతో బొగ్గులపై దుప్పటిపడి మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో తాను మరణించినట్లు పోలీసులు కేసు ఫైల్ చేసుకున్నారు.