ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల జీతం పెరిగింది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆయన 79.1 మిలియన్ డాలర్ల వేతనం అందుకోనున్నారు. ఈ విషయాన్ని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. 2023 ఆర్థిక సంవత్సరంలో అందుకున్న 48.5 మిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది 63 శాతం ఎక్కువ. జూన్‌తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ వృద్ధిలో దూసుకెళ్లింది. కంపెనీ షేర్లు దాదాపు 31.2శాతం లాభపడ్డాయి.