దిగుమతి సుంకంలో కోతతో దేశంలో బంగారానికి భారీగా డిమాండ్ ఏర్పడింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో దేశవ్యాప్తంగా పసిడి గిరాకీ 18 శాతం పెరిగి 248.3 టన్నులకు చేరిందని ప్రపంచ స్వర్ణ మండలి పేర్కొంది. కాగా, ధన త్రయోదశి కారణంగా గిరాకీ ఏర్పడటంతో 10 గ్రాముల బంగారం ధర రూ.300 పెరిగి రూ.81,400కు చేరుకుంది. ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో చైనా తర్వాతి స్థానంలో భారత్ నిలుస్తోంది.