ఆధార్, పాన్లతో సహా పౌరులకు సంబంధించిన సున్నితమైన వివరాలు బహిర్గతం చేస్తున్న వెబ్సైట్లపై కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. ఆ వెబ్సైట్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టినట్లు తెలిపింది. ఆయా వెబ్సైట్లలో భద్రతా లోపాలు ఉన్నట్లు గుర్తించినట్లు కేంద్ర ఐటీశాఖ తెలిపిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం చెప్పుకొచ్చింది.