ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 500 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏపీలో 21, తెలంగాణలో 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://nationalinsurance.nic.co.in/ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 11 నవంబర్ 2024 దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ.