Gold Rates Today : వరుసగా ఐదో రోజూ తగ్గిన బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరలు వరుసగా ఐదు రోజులుగా తగ్గుతూనే ఉన్నాయి. గురువారం కూడా వీటి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఏ లోహం ధర ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఇక్కడ చదివేయండి.
Gold and Silver Rates Today : బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. వరుసగా ఐదు రోజులుగా వీటి ధరలు తగ్గుతుండటం గమనార్హం. వెండి భారీగా తగ్గుతున్నప్పటికీ బంగారం మాత్రం అరకొరగానే తగ్గుతూ వస్తోంది. అయితే ఈ రోజు ట్రెండ్ ఇందుకు భిన్నంగా ఉంది. గురువారం పది గ్రాముల పసిడి ధర రూ.470 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.73,300కి చేరుకుంది.
విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ తదితర ప్రధాన నగరాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) గురువారం రూ.73,300 గా కొనసాగుతోంది. అయితే ఈ ధరలు మళ్లీ మారే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ పేర్కొన్న ధర మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నది మాత్రమే. అలాగే నగల్ని కొనుక్కోవాలని అనుకునే వారు అదనంగా జీఎస్టీ, మజూరీల్లాంటివీ చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి.
ఇక దేశీయ మార్కెట్లలో కిలో వెండి ధర(Silver Rate) స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. రూ.162 తగ్గడంతో నేడు కేజీ వెండి ధర రూ.89,170కి చేరుకుంది. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ తదితర ప్రధాన నగరాల్లోనూ వెండి ధర దాదాపుగా ఇలాగే కొనసాగుతోంది.
ఇక స్పాట్ గోల్డ్, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్లో సైతం క్రమంగా తగ్గుతున్నాయి. గురువారం ఔన్సు స్పాట్ గోల్డ్ 16 డాలర్లు తగ్గి 2301 డాలర్లకు చేరుకుంది. ఔన్సు వెండి 28.80 డాలర్లుకు చేరుకుంది.