దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమై.. స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. ఈ వారంలో వెలువడబోయే ద్రవ్యోల్బణ గణాంకాలపై దృష్టి పెట్టిన మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. సెన్సెక్స్ 45 పాయింట్లు లాభపడి 79,532 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 14 పాయింట్లు లాభంతో 24,162 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోల్చితే రూపాయి మారకం విలువ జీవనకాల కనిష్టం 84.38కి పడిపోయింది.