TG: బీమా వైద్య సేవల విభాగంలోని ESI ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న 600 వైద్య సిబ్బంది పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో డాక్టర్లు, స్టాఫ్‌నర్సుల పోస్టులే ఎక్కువగా ఉన్నాయి. ఈ పోస్టులను మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయనుంది. గత నెలలోనే మెడికల్ బోర్డు 4 వేల పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా.., తాజాగా మరో 600 పోస్టుల భర్తీకి సర్కారు ఆమోదం తెలిపింది.