చిన్న పెట్టుబడి పథకాలను ఆకర్షించేందుకు LIC కృషి చేస్తోంది. త్వరలోనే రోజుకు రూ.100 సిప్‌లో పొదుపు చేసే వీలు కల్పించనుంది. అలాగే నెలవారీ సిప్‌ను రూ.1,000 నుంచి రూ.200కు కూడా తగ్గించనుంది. ఈ మార్పులు అక్టోబరు 7లోపు తీసుకురానుంది. చిన్న వ్యాపారులు స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు ఇది వీలు కల్పిస్తుందని భావిస్తోంది. కాగా నెలకు రూ.250తో సిప్ అందుబాటులోకి తెచ్చే ఆలోచన ఉన్నట్లు ఇటీవల సెబీ ప్రకటించింది.