పండగల వేళ నిత్యావసర సరుకుల ధరలు మండిపోతున్నాయి. పప్పు, వంటనూనెల ధరలు 22% పెరగటంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఉల్లి ధర రూ.100కు చేరువలో ఉంది అల్లం, వెల్లుల్లి ధరలు వారం రోజుల్లోనే రూ.60 చొప్పున పెరిగాయి. కిలో అల్లం ధర రూ.100 నుంచి రూ.160, వెల్లుల్లి రూ.300 నుంచి రూ.360కి చేరగా.. మాల్స్‌లో వెల్లుల్లి ధర రూ.400 ఉంది. ఇక కిలో కందిపప్పు రూ.170, పెసరపప్పు రూ.150, మినపపప్పు రూ.135, సెనగపప్పు రూ.105కు పెరిగాయి.