BPT: అమృతలూరు మండలంలోని పాంచాళవరంలో విద్యుదాఘాతంతో పెంకుటిల్లు ఆదివారం దగ్ధమైంది. గ్రామంలో జయమ్మకు చెందిన గృహంలో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. జయమ్మ, తన కుమారుడి కుటుంబ సభ్యులు ప్రమాద సమయంలో బయటకు వెళ్లారు. అదే సమయంలో ఇంటి నుంచి పొగ, మంటలు రావడం గమనించిన స్థానికులు అదుపు చేసేందుకు యత్నించారు. ఆస్తి నష్టం సుమారు రూ.1.5లక్షలు ఉంటుంది.