GNTR: పట్టణ శివారు రెడ్డిపాలెంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న చిలకలూరిపేట విద్యార్థిని స్కూల్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పాఠశాల యాజమాన్యం విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విద్యార్థిని మృతిపట్ల యాజమాన్యం అనేక రకమైన కారణాలు చెప్తోందని బాధిత కుటుంబం ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.