NLR: జిల్లా వెంకటాచలం టోల్ ప్లాజా సమీపంలో సోమవారం ఉదయం క్యాంపర్ను లారీ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. గూడూరు వైపు నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న క్యాంపర్ ముందు ఆగి ఉన్న లారీని ఢీకొంది. దీంతో క్యాంపర్లోని ఒకరు చనిపోయారు. పోలీసుల ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.