AP: కడప జిల్లా పులివెందుల సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు అదుపుతప్పి 30 అడుగుల లోయలో పడింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలవగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కదిరి నుంచి పులివెందులకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను సమీప ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా.. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.