NLR: ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాలోలాగా క్రైమ్ జరిగింది. నెల్లూరులో ఓ మహిళను హత్య చేసిన తండ్రీకూతురు మృతదేహాన్ని సూట్‌కేస్‌లో కుక్కి రైలులో చెన్నై తీసుకెళ్లారు. మీంజూర్ రైల్వే స్టేషన్ దగ్గర సూట్‌కేస్ విసిరేస్తుండగా ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మహేశ్ వారిని పట్టుకున్నారు. సూట్‌కేస్ తెరిచి చూడగా అందులో మహిళ మృతదేహం ఉంది.