కృష్ణ: విజయవాడ శివారులో సోమవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని బైక్పై వెళుతున్న ఇద్దరు మృతిచెందారు. మృతులలో ఒకరు నున్న గ్రామానికి చెందిన సాంబశివరావు కాగా, మరొకరు గెయిల్ కంపెనీలో పనిచేస్తున్న దుర్గారావుగా స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న నున్న సీఐ కృష్ణ మోహన్ కేసు నమోదు చేశారు.