ఉత్తర ఫిలిప్పీన్స్లో తుఫాన్ బీభత్సం సృష్టించింది. భారీ వరదల కారణంగా కొండచరియలు విరిగిపడి దాదాపు 23 మంది మృతిచెందారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి అధికారులు సహాయకచర్యలు చేపట్టారు. ఈ ఘటనలో వందలాది కార్లు కొట్టుకుపోయాయి. దీంతో స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలను ప్రభుత్వం మూసివేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.