కృష్ణ: అమరావతి డ్రోన్ సమ్మిట్‌లో ఓ నకిలీ ఐఏఎస్ అధికారి (నరసింహ మూర్తి) విషయం బట్టబయలు అయ్యింది. డ్రోన్ సమ్మిట్‌కు తానే రూపకల్పన చేశానని అధికారులను పరిచయం చేసుకునే క్రమంలో డ్రోన్ కార్పొరేషన్ ఎండీ దినేశ్ ఆయనను గుర్తించాడు. గతంలోనూ టీటీడీ టికెట్ల కోసం అధికారులను బెదిరించడంతో జైలుకు వెళ్లి వచ్చాడు. మరోసారి ఐఏఎస్ అవతారం ఎత్తి మోసాలకు పాల్పడేందుకు ప్రయత్నిచాడు.