KRNL: కోడుమూరు మండలం కొత్తూరు గ్రామ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తూరు- పెంచికలపాడు గ్రామాల మధ్య బొలెరో వాహనం చెట్టును ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.