గుజరాత్లో నకిలీ కోర్టు గుట్టు రట్టయింది. శ్యామ్యుల్ అనే వ్యక్తి నకిలీ కోర్టు ఏర్పాటు చేసి, జడ్జిగా తీర్పులివ్వడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఓ ప్రభుత్వ భూమికి సంబంధించి శ్యామ్యుల్ ఇచ్చిన తీర్పును అమలు చేయాలని సదరు క్లయింట్ సిటీ సివిల్ కోర్టులో అప్పిల్ చేయడంతో ఈ విషయం బయటపడింది. ఇది గత ఐదేళ్లుగా నడుస్తుందని.. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.