రూ.6,100 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన కొద్దిసేపటికే వరంగల్ బహిరంగ సభలో ప్రధాని మోడీ(modi) తెలుగులో నమస్కారం అంటూ ప్రసంగించారు. రాష్ట్రానికి కేంద్రం సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు.
తెలంగాణలోని వరంగల్‌లో(warangal) రూ.6,100 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ(modi) శనివారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రసంగించిన మోడీ తెలంగాణ కొత్తగా పుట్టిన రాష్ట్రం కావచ్చు. కానీ ఇది దేశ చరిత్రకు ఎంతో దోహదపడిందని అన్నారు. కేంద్రం ప్రాజెక్టులు, కార్యక్రమాలు తెలంగాణకు వివిధ రంగాలలో అనేక రకాలుగా ప్రయోజనం చేకూరుస్తున్నామని వెల్లడించారు. తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోడీ..తెలుగువారి ప్రతిభ సామర్థ్యాన్ని దేశం మరింత పెంచిందని అన్నారు. ఈ మధ్యనే తెలంగాణ ఏర్పడి 9 ఏళ్లు పూర్తయ్యాయని, దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని గుర్తు చేశారు.
ఆర్థిక అభివృద్ధిలో కూడా తెలంగాణ(telangana) ప్రధాన పాత్ర పోషిస్తుందని, ప్రస్తుతం రాష్ట్రంలో 6 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించుకుంటున్నామని వెల్లడించారు. దీంతోపాటు తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని, కరీంనగర్(karimnagar) గ్రానైట్ పరిశ్రమకు కేంద్రం సహకారం అందిస్తుందని అన్నారు. రైల్వే ఉత్పత్తుల విషయంలో ఇప్పటికే అనేక రికార్డులు సృష్టించి పలు ఉత్పత్తులను దేశీయంగా ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. భారతదేశం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించినప్పుడు, అందులో తెలంగాణ ప్రజల పాత్ర కూడా ఉందని ప్రధాన మోడీ అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జి. కిషన్‌రెడ్డి(kishan reddy), బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కుమార్, ఎంపీ ధర్మపురి అర్వింద్ కుమార్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘునందర్ రావు, తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ తర్వాత ప్రధాని మోడీ రాజస్థాన్‌కు 1.40 గంటలకు వెళ్లనున్నారు. అక్కడ బికనీర్ జిల్లాలోని నౌరంగ్‌దేసర్‌లో ర్యాలీలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో ఆయన 2,500 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.