• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

గూగుల్ మ్యాప్ నిర్వాకం.. కెనాల్‌లోకి కారు

గూగుల్ మ్యాప్ ఫాలో అవుతూ కారు నడుపుకుంటూ వెళ్లిన వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. గూగుల్ సందేశాలను అనుసరిస్తూ వెళ్లిన కారు కెనాల్‌లో పడిపోయింది. ఈ సంఘటన యూపీలోని రాయ్‌బరేలీ- పిలిభిత్ రహదారిపై జరిగింది. కాగా కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎలాంటి హాని జరగలేదు. సమాచారం తెలుసుకున్న అధికారులు ఓ క్రేన్‌ను తీసుకువచ్చి కాలువలో పడిపోయిన కారును బయటకి తీశారు.

December 4, 2024 / 06:06 AM IST

మొగ్దూంపూర్లో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

KNR: మొగ్దుంపూర్ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై ఇద్దరు వ్యక్తులు కరీంనగర్ వైపు వెళ్తుండగా.. ఓ లారీ అకస్మాత్తుగా యూటర్న్ తీసుకుంది. దీంతో వారు లారీని వెనుకనుంచి ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో చెన్నూర్‌కు చెందిన సాగర్ మృతిచెందారు. దండేపల్లి మండలం కన్నేపల్లికి చెందిన శ్రీనుకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని 108కి సమాచారమిచ్చి ఆసుపత్రికి తరలించారు.

December 4, 2024 / 04:36 AM IST

చిరుతను ఢీకొట్టిన వాహనం

TG: కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలంలో ప్రమాదం చోటుచేసుకుంది. 44వ జాతీయ రహదారిపై ఓ వాహనం చిరుతను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిరుతకు స్వల్ప గాయాలు కావడంతో చాలా సేపు రోడ్డుపైనే ఉంది. దీంతో చిరుతను చూసిన వాహనదారులు భయాందోళనకు గురైయ్యారు. దాదాపు రెండు గంటల పాటు రోడ్డుపైనే పడుకున్న చిరుత.. అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు గాలింపు చేపట్టారు.

December 3, 2024 / 10:58 PM IST

విద్యుత్ ఘాతంతో వివాహిత మృతి

SRPT: కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండలో మంగళవారం విద్యుత్ ఘాతానికి గురై వివాహిత మహిళ మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. గ్రామానికి చెందిన మహమ్మద్ భార్య షేక్ నసీమా వాటర్ హీటర్ పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.

December 3, 2024 / 08:39 PM IST

బైకు ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతి

CTR: ఏర్పేడు-వెంకటగిరి రోడ్డుపై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. పల్లంపేట నుంచి బైక్‌పై వస్తున్న వ్యక్తిని పల్లాం దగ్గర తిరుపతి నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

December 3, 2024 / 08:36 PM IST

మధిరలో రన్నింగ్ ట్రైన్ నుండి మున్నేటిలో జారిపడ్డ వ్యక్తి

KMM: మధిర పట్టణంలోని మున్నేటి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిపై నుండి మంగళవారం మధ్యాహ్నం విజయవాడ నుండి సికింద్రాబాద్ వెళ్తున్న కృష్ణ ఎక్స్ప్రెస్ రన్నింగ్ రైలు నుండి జారిపడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సాయి చరణ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి దీంతో స్థానికులు గమనించి ఆ వ్యక్తిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

December 3, 2024 / 08:24 PM IST

రోడ్డు ప్రమాదం.. చిరుతకు గాయం

KMR: సదాశివనగర్ మండలం దగ్గి – చంద్రాయనపల్లి గ్రామాల మధ్యలో ఉన్న అటవీ ప్రాంతంలో మంగళవారం రాత్రి జాతీయ రహదారి 44 పై చిరుతను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిరుతకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో రోడ్డు మీదనే పడి ఉండడంతో వాహనదారులు జాతీయ రహదారిపై ప్రయాణించడానికి జంకుతున్నారు.

December 3, 2024 / 08:19 PM IST

నూజివీడు పట్టణంలో వరుస దొంగతనాలు

కృష్ణా: నూజివీడు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. నవంబర్ 24వ తేదీన పట్టణంలోని ఎస్ఐసీ వద్ద మహిళ నుంచి 7 తులాల బంగారు గొలుసు చోరీకి విఫలయత్నం జరిగింది. అదేరోజు చర్చికి వెళుతున్న మహిళ నుంచి 3 కాసుల బంగారు గొలుసు చోరీ జరిగింది. 27వ తేదీ విద్యుత్ ఏడీఈ దుర్గారావు గృహంలో 25 కాసులు చోరీలతో ప్రజలు భయ బ్రాంతులవుతున్నారు.

December 3, 2024 / 06:47 PM IST

గుడివాడలో దారుణం భర్తను చంపిన భార్య

కృష్ణా: గుడివాడలో దారుణం చోటుచేసుకుంది. 22 వార్డులో నివసిస్తున్న చిన్నా అనే వ్యక్తిపై అతని భార్యజ్యోతి కత్తితో దాడి చేయడంతో చిన్న మృతి చెందాడు. వీరికి పిల్లలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. భర్తను చంపి ఓ కుమారుడుని తీసుకొని భార్య పరార్ అయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు గుడివాడ పోలీసులు వెల్లడించారు.

December 3, 2024 / 06:23 PM IST

పీలేరులో వర్షం కారణంగా రాకపోకలు బంద్

అన్నమయ్య: పీలేరు మండలంలోని బాలంవారి పల్లి, నూనెవారి పల్లి మార్గంలో పింఛానది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పింఛానది ప్రవాహాన్ని రెవెన్యూ, ఎస్ఐ బాలకృష్ణ, పోలీసు అధికారులు మంగళవారం పరిశీలించారు. గతంలో ఇక్కడున్న మార్గంలో నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి ఇద్దరూ మరణించిన నేపథ్యంలో అధికారులు చర్యలు చేపట్టారు.

December 3, 2024 / 06:21 PM IST

జాతీయ రహదారిపై బొగ్గు లారీ బోల్తా

SKLM: నరసన్నపేట జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు టెక్కలి నుండి శ్రీకాకుళం వైపు వెళుతున్న బొగ్గు లారీ ముందు పేలిపోవడంతో లారీ బోల్తా పడినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు 100 మీటర్ల మీద లారీ రైలింగ్‌ను తాకుతూ విద్యుత్ స్తంభానికి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

December 3, 2024 / 06:20 PM IST

రైలులో గుర్తుతెలియని వ్యక్తి మృతి

MNCL: రైలులో ప్రయాణిస్తూ గుర్తుతెలియని ఒక వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. మృతుడు దాదర్ ఎక్స్ ప్రెస్ రైలులోని జనరల్ బోగీలో అపస్మారక స్థితిలో ఉండగా మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో దింపారు. వెంటనే 108 అంబులెన్స్‌కు కాల్ చేయగా అక్కడికి చేరుకొని అప్పటికే మరణించినట్లు తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ గదిలో భద్రపరిచారు.

December 3, 2024 / 05:55 PM IST

గుర్తు తెలియని వ్యక్తులు కాల్స్ లిఫ్ట్ చేయవద్దు

NTR: తిరుమలగిరి గ్రామానికి చెందిన ఒక్క గృహిణికి నిన్న రాత్రి +918423958177 నెంబర్ నుండి ఎవరో గుర్తు తెలియని కాల్స్ వచ్చాయని ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా చిల్లకల్లు ఎస్ఐ శ్రీనివాస్ ఆ నంబర్‌ను బ్లాక్ చేయించారు. ఎస్ఐ మాట్లాడుతూ.. గుర్తుతెలియని వ్యక్తుల కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

December 3, 2024 / 05:28 PM IST

చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్.. నగదు బంగారం స్వాధీనం

కోనసీమ: ఆలమూరు మండలం చొప్పెల్లకు చెందిన విశ్వనాధుల వీరభద్రరావు ఇంట్లో నవంబర్ 26న జరిగిన చోరీ కేసులో కడియం మండలం రాజవోలు గ్రామానికి చెందిన తమ్మ వినోద్ కుమార్, ఏలూరు పవన్ కుమార్‌లను అరెస్ట్ చేసినట్లు రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ తెలిపారు. నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.3 లక్షల నగదు, 48 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీన పరుచుకున్నారు.

December 3, 2024 / 05:27 PM IST

శబరి వెళ్లిన భక్తులకు తప్పిన ప్రమాదం

AP: విజయనగరం జిల్లా నుంచి శబరి వెళ్లిన భక్తులకు ప్రమాదం తప్పింది. గత నెల 25న రేగిడి మండలం మజ్జిరాముడుపేట నుంచి 41 మంది శబరి వెళ్లారు. కంచి వద్ద బస్సు ఆపి వంట చేస్తుండగా ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో అయ్యప్ప భక్తుల బస్సు, సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. ప్రాణాపాయం నుంచి బయటపడ్డ అయ్యప్ప భక్తులు తిరిగి కంచి నుంచి మరో బస్సులో స్వగ్రామం బయల్దేరారు.

December 3, 2024 / 04:20 PM IST