SRCL: గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన వేములవాడ మండలం నూకలమర్రిలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. నూకలమర్రికి చెందిన రషీద్‌ను తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్లుగా తెలిపారు. రషీద్ గంగాధర మండలంలో డాక్యుమెంట్ రైటర్‌గా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుడికి భార్య, కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాగా, ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.