తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలోని తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయనున్నారు. దాదాపు 20 ఏళ్లుగా ఆయన ఒకే క్వార్టర్లో ఉన్నారు. తాజా ఫలితాలతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రు. ఈ క్రమంలో ఢిల్లీలోని అధికార నివాసాన్ని కేసీఆర్ ఖాళీ చేయనున్నారు.
KCR will vacate the official residence on Tughlaq Road in Delhi
KCR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)కు ఢిల్లీలోని తుగ్లక్ రోడ్(Tughlaq Road)తో దాదాపు 20 సంవత్సరాల అనుబంధం ఉంది. తాను ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా పదవి చేపట్టినప్పటి నుంచి ఉంటున్న అధికార నివాసాన్ని ఖాళీ చేయనున్నారు. 2004లో టీఆర్ఎస్ తరపున కరీంనగర్ ఎంపీగా గెలుపొందారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో కేసీఆర్ కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో ఆయనకు తుగ్లక్ రోడ్లో టైప్ 8 క్వార్టర్‌ను కేటాయించారు. 2006లో కేసీఆర్ కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఉపఎన్నికల్లో మళ్లీ ఎంపీగా విజయం సాధించి అదే నివాసంలో కొనసాగారు. 2009లో మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పుడు కూడా అదే నివాసంలోనే ఉన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో మొదటి సారి ముఖ్యమంత్రి అయ్యారు. సీఎం అయిన తర్వాత కూడా ఢిల్లీలోని ఆ క్వార్టలోనే కొనసాగారు. ముఖ్యమంత్రులకు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో అధికారిక నివాసాలను కేటాయిస్తుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎంగా ఉన్న కేసీఆర్ కు కేంద్రం అదే నివాసాన్ని కేటాయించింది. తరువాత నిజామాబాద్ ఎంపీగా గెలుపొందిన కవిత కూడా అదే నివాసంలో కొనసాగారు. తెలంగాణలో జరిగిన తాజా ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెందడంతో సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఢిల్లీలోని అధికార నివాసాన్ని కేసీఆర్ ఖాళీ చేయనున్నారు.