రీసెంట్గా వచ్చిన హిట్ ఫ్రాంచైజ్ ‘హిట్ 2’ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 28 కోట్లకు పైగా కలెక్షన్ అందుకుని చాలా ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ అయినట్టు తెలుస్తోంది. అలాగే ఈ మూవీలో అడివి శేష్ నటనపై ప్రశంసలు కురుస్తుండగా.. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వ ప్రతిభకి కూడా మంచి మార్కులు పడ్డాయి. దాంతో హిట్-3 గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. హిట్2 చివర్లో రూత్‌లెస్ కాప్ ‘అర్జున్ సర్కార్’గా నాని పాత్రను పరిచయం చేశారు. హిట్3లో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో నాని కనిపించనున్నట్టు చెప్పారు. తాజాగా హిట్ 3 పై దర్శకుడు శైలేష్ కొలను సాలిడ్ అప్టేట్ ఇచ్చాడు. ‘నా మాటలు గుర్తు పెట్టుకోండి.. హిట్ 3లో అర్జున్ సర్కార్ పాత్ర నెక్స్ట్ లెవల్లో ఉంటుంది.. ఇది నా ప్రామిస్..’ అని నాని ఫోటో ఒకటి పోస్ట్ చేశారు. ప్రస్తుతం నాని లుక్ వైరల్‌గా మారింది. అయితే హిట్ ఫ్రాంచైజ్‌లో నాని, అడివి శేష్‌తో పాటు విజయ్ సేతుపతి కూడా ఉంటాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కానీ ‘హిట్ 3’లో నాని, అడివి శేష్‌లతో పాటు విశ్వక్ సేన్ కూడా ఉండనున్నట్లు హింట్ ఇచ్చాడు. ఈ ముగ్గురితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘పెద్దదే ప్లాన్ చేస్తున్నాం.. హిట్ 3 మాసివ్‌గా ఉండనుంది’ అని రాసుకొచ్చాడు శైలేష్ కొలను. ఈ లెక్కన హిట్3 పాన్ ఇండియా స్థాయిలో భారీగా ప్లాన్ చేస్తున్నారని చెప్పొచ్చు. అలాగే పలు భాషలకు చెందిన స్టార్ క్యాస్టింగ్ కూడా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఇన్వాల్వ్ అవనున్నట్టు టాక్. అయితే హిట్ 3ని ఎప్పుడు పట్టాలెక్కిస్తారా అనేది తెలియాల్సి ఉంది.