»Flour For Heart Health 5 Types Of Atta That Are Beneficial For The Heart
Heart Health tips: ఇవి తింటే మీ గుండెకు ఢోకా లేనట్లే!
గుండె సంబంధిత మరణాలు, కేసులు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వినపడుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా, అందరూ గుండె సంబంధిత సమస్యల బారినపడుతున్నారు. అయితే దానిని మనం ఫాలో అయ్యే జీవన శైలే కారణం అని నిపుణులు చెబుతున్నారు. పిండి పదార్థాలు, వేయించిన ఆహారం, రెడ్ మీట్ తీసుకోవడం తగ్గించడం అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. అయితే ఇవి మాత్రమే కాదు. మనం తీసుకునే ఆహారాల్లో ఈ కింది వాటిని ప్రయత్నించాలట. అవేంటో ఓసారి చూద్దాం.
గుండె(Heart) సంబంధిత వ్యాధులకు ఇప్పుడు వృద్ధాప్య సమస్య ఒక్కటే కాదు. పెరుగుతున్న జీవనశైలి మార్పులతోపాటు వీటిని కూడా ఆహారంలో భాగంగా చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటి ద్వారా గుండె సంబంధిత వ్యాధుల వ్యాప్తి తగ్గుతుందని అంటున్నారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.
స్టీల్-కట్ వోట్స్ పిండి:ఇందులో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా బీటా-గ్లూకాన్, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుందని తేలింది.
అమరాంత్ పిండి:అమర్నాథ్ పిండిలో కొలెస్ట్రాల్-తగ్గించే గుణాలు ఇందులో ఉండే ఫైటోస్టెరాల్స్ కారణంగా ఉన్నాయి.
జొన్న పిండి: జొన్న పిండిలోని ఫైటోకెమికల్స్, ఫినాల్స్, టానిన్లు , ప్లాంట్ స్టెరాల్స్ , హైపర్ కొలెస్టెరోలేమియా ప్రభావాన్ని కలిగి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఈ, బీ, ఖనిజాలు ఐరన్, మెగ్నీషియం, ముఖ్యమైన మొత్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడతాయి.
బాదం పిండి: MUFA, PUFAలో సమృద్ధిగా ఉంటుంది. కొవ్వు ఆమ్లాలలో, ఒలేయిక్ ఆమ్లం రక్త కొలెస్ట్రాల్ స్థాయిని ఇది తగ్గిస్తుంది, లినోలెయిక్ ఆమ్లం రక్త నాళాల సంకోచాన్ని నిరోధిస్తుంది. లినోలెనిక్, లినోలెయిక్ ఆమ్లాలు రక్తంలో లిపిడ్, గ్లిజరైడ్ స్థాయిలు, రక్తపోటును తగ్గిస్తాయి.
బజ్రా పిండి:బజ్రా పిండిలో ఉండే లిగ్నిన్, ఫైటోన్యూట్రియెంట్లు మంచి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. తద్వారా గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. ఈ కారణంగా, పెర్ల్ మిల్లెట్ గుండె ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు.