తిరుపతి గరుడ వారధిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భార్య మృతి చెందగా.. భర్తకు గాయాలయ్యాయి. జీవకోన రాజీవ్ గాంధీ కాలనీకి చెందిన చంద్రకళ తన భర్త నాగరాజుతో కలిసి అప్పలాయగుంట దైవ దర్శనానికి వెళ్లారు. బైకుపై తిరిగి ప్రయాణమవ్వగా గరుడ వారధి ఫ్లైఓవర్ పై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు.