BHNG: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం సాయంత్రం యాదగిరిగుట్ట మండలం తాళ్లగూడెం స్టేజి వద్ద కారు బైకు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.