భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము…. ఏపీలో పర్యటించనున్నారు. ఆమె రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. తొలిసారి ఏపీ పర్యటనకు వస్తుండటం విశేషం. ఈ సందర్భంగా రాష్ట్రపతికి రాష్ట్ర ప్రభుత్వం పౌర సన్మానం ఏర్పాటు చేసింది. రాష్ట్రపతి గౌరవార్ధం రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అధికారిక విందు ఏర్పాటు చేశారు.
ఇక ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వం తరపున ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ క్రమంలో రేపు సీఎం వైఎస్ జగన్ విజయవాడ పర్యటన వివరాలు ఈ మేరకు ఉన్నాయి. ఉదయం 10.25 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న ముఖ్యమంత్రి జగన్ 10.50 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో రాష్ట్రపతికి స్వాగతం పలకనున్నారు.
ఆ తరువాత 11.25 – 12.15 గంటల మధ్య పోరంకి మురళీ కన్వెన్షన్ హాల్లో రాష్ట్రపతికి రాష్ట్ర ప్రభుత్వం పౌర సన్మానం కార్యక్రమం ఏర్పాటు చేయగా అందులో పాల్గొన్నారు. అనంతరం తాడేపల్లి నివాసానికి సీఎం జగన్ చేరుకోనున్నారు.
12.50 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి రాజ్‌భవన్‌కు బయలుదేరి 1.00 – 2.15 గంటలకు రాష్ట్రపతి గౌరవార్ధం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఏర్పాటుచేసిన అధికారిక విందులో ముఖ్యమంత్రి జగన్ పాల్గొననున్నారు. అనంతరం 2.35 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో రాష్ట్రపతికి వీడ్కోలు పలికి తాడేపల్లి నివాసానికి సీఎం జగన్ చేరుకోనున్నారు.