NLG: మిర్యాలగూడలో రోడ్డుప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగిందిన ప్రయాణికులు తెలిపారు. తెల్లవారుజామున ఒక్కసారిగా బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకి దూసుకెళ్లిందని చెప్పారు. ప్రమాదం జరిగాక డ్రైవర్ పరారయ్యారని తెలిపారు. కాగా ఆ బస్సు 55 మంది ప్రయాణికులతో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. 10 మందికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది.