AP governor: గవర్నర్ ప్రసంగంలో లేని ‘మూడు రాజధానులు’.. ఎందుకంటే
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు (andhra pradesh budget session 2023) మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ (Governor) ఎక్కడ కూడా రాష్ట్ర రాజధానికి (Andhra Pradesh Capital) సంబంధించి మూడు రాజధానులను (Andhra Pradesh three capitals) ఎక్కడా ప్రస్తావించలేదు.
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు (andhra pradesh budget session 2023) మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ (Governor) ఎక్కడ కూడా రాష్ట్ర రాజధానికి (Andhra Pradesh Capital) సంబంధించి మూడు రాజధానులను (Andhra Pradesh three capitals) ఎక్కడా ప్రస్తావించలేదు. ఇప్పటి వరకు ప్రతి ప్రసంగంలో మూడు రాజధానుల అంశం కనిపించేది. పరిపాలనా వికేంద్రీకరణ ప్రస్తావన కూడా ఉండేది. కానీ అసెంబ్లీ, లోకసభ ఎన్నికలకు ఏడాది ముందు ప్రవేశ పెడుతున్న ఈ బడ్జెట్ గవర్నర్ ప్రసంగంలో మాత్రం మూడు రాజధానుల అంశం లేకపోవడం గమనార్హం. పైగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఒకటికి నాలుగుసార్లు… తాను విశాఖకు షిఫ్ట్ అవుతున్నట్లు చెబుతూ వస్తున్నారు. ఇలాంటి సమయంలో మూడు రాజధానుల అంశం లేకపోవడానికి ఓ కారణం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ గవర్నర్ (Andhra Pradesh Governor) ఎస్ అబ్దుల్ నజీర్ (S Abdul Nazeer) సుదీర్ఘ కాలం సుప్రీం కోర్టులో (Supreme Court) న్యాయమూర్తిగా (Judge) పని చేశారు. అదే సమయంలో ఈ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈసారి దీనిని జత చేర్చలేదని భావిస్తున్నారు.
బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. తమ ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తోందని, పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. నవరత్నాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. అవినీతికి తావులేకుండా అర్హులందరికీ నేరుగా లబ్ధి చేకూరుతోందన్నారు. నాలుగేళ్లుగా సుపరిపాలన అందిస్తున్నామని, వినూత్నంగా వాలంటీర్ వ్యవస్థ అమలు చేస్తున్నామన్నారు. ఆర్థిక అభివృద్ధిలో రాష్ట్రం ముందడుగు వేసిందని, వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో అనూహ్య ప్రగతి సాధిస్తున్నామన్నారు.
నాలుగేళ్లుగా నవరత్నాలతో రాష్ట్రానికి సంక్షేమ పాలన అందుతోందని, ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా అవినీతి లేని పాలన అందుతోందని, రాష్ట్రంలో 11.43 శాతం జీడీపీ వృద్ధి నమోదు అయినట్లు చెప్పారు. 2020-21 జీడీపీ వృద్ధిలో దేశంలోనే ఆంధ్ర ప్రదేశ్ నెంబర్ వన్ గా అవతరించిందన్నారు. అర్హులైన లబ్ధిదారులందరికీ ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు. కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో అనూహ్య ప్రగతి సాధిస్తున్నామని, 11.43 శాతం వృద్ధి రేటును సాధించామన్నారు. అంతేకాకుండా ఆర్థిక అభివృద్ధిలో ఆంధ్ర ప్రదేశ్ ముందంజలో ఉందన్నారు. విద్యా విధానాలు పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నాడు – నేడుతో స్కూళ్ల ఆధునికీకరణ, మధ్యాహ్న భోజన పథకం అమలులోకి తెచ్చామన్నారు. అమ్మ ఒడి కింద ఒక్కో లబ్ధిదారుకు ఏటా రూ.15 వేలు అందిస్తున్నట్లు తెలిపారు.
గవర్నర్ ప్రసంగం (Governor Speech) సమయంలో తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) నిరసన తెలిపారు. రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ ప్రాజెక్టు పూర్తి చేశారో చెప్పాలని నినాదాలు చేశారు. దీంతో సభలో కాసేపు గందరగోళం నెలకొన్నది. గవర్నర్ ఆ తర్వాత తన ప్రసంగాన్ని పూర్తి చేశారు.