TG: రంగారెడ్డి జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది. చేవెళ్ల మండలం ఆలూరు గేటు వద్ద కూరగాయల వ్యాపారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.