ఉత్తరాఖండ్ అల్మోరా జిల్లాలో తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. బస్సు లోయలో పడటంతో 36 మంది ప్రయాణికులు మరణించారు. మరో 19 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సహా పలువురు నేతలు సంతాపం తెలిపారు. అలాగే, సీఎం పుష్కర్ సింగ్ ధామి సంఘటనా స్థలానికి బయలుదేరారు. బాధితులకు ఆర్థికసాయం ప్రకటించడంతోపాటు మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు.