బాలీవుడ్ నటుడు కిడ్నాప్ అయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ‘స్త్రీ 2’ మూవీ నటుడు ముష్తాక్ ఖాన్ను ఇటీవల కొంతమంది దుండగులు కిడ్నాప్ చేశారట. ఢిల్లీ-మీరఠ్ హైవేపై 12 గంటల పాటు ఆయనను భయభ్రాంతులకు గురిచేసినట్లు తాజాగా ఆయన సన్నిహితులు వెల్లడించారు. కాగా.. ప్రస్తుతం ఆయన సురక్షితంగానే ఉన్నట్లు సమాచారం.