NGKL: చారకొండ మండలంలోని సారబండ తాండ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మోటార్ సైకిల్ పై దేవరకొండ వైపు వెళ్తుండగా మోటార్ సైకిల్ అదుపుతప్పి ర్యాంపును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పావని (22) యువతికి తలకు బలమైన గాయం కావడంతో ఆమె మృతి చెందింది. మరో వ్యక్తికి గాయాలైనట్లు స్థానికులు గుర్తించారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం జరిగినట్లు తెలిపారు.