NLR: నగరంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రకాశం(D) పెద్దచెర్లోపల్లి(M)కి చెందిన ఓ కుటుంబ కలవాయి(M) చీపినాపి గ్రామంలో ఓ శుభకార్యానికి వెళ్లి కారులో తిరిగి వస్తుండగా శనివారం తెల్లవారుజామున వరికుంటపాడు హైవేపై ప్రమాదానికి గురయ్యారు. విజయవాడ నుంచి కదిరికి బంతిపూల కోసం వెళ్తున్న మినీ ట్రాలీ వారి కారును ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా మరో 8 మందికి గాయాలయ్యాయి.