SKLM: పలాస మండలం పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి చిన్నబడాంలో శుక్రవారం ఉదయం అట్టాడ మురళి అనే యువకుడు చెట్టుకి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.