KDP: ఒంటిమిట్ట చెరువు కట్టపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బైకు, కారు ఢీకొన్నాయి. స్థానికుల వివరాల మేరకు.. ఒంగోలుకు చెందిన వీఎస్ ఫణీంద్ర కుమార్ అనే వ్యక్తి కారు చెరువు కట్ట పైకి రాగానే బైకు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న వ్యక్తి గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది