ప్రకాశం: కొరిశపాడు మండలం వెంకటాపురం జాతీయ రహదారి వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నేలటూరు గ్రామానికి చెందిన ఊసరపల్లి సురేష్ రేణింగివరం నుండి ద్విచక్ర వాహనంపై వస్తున్న క్రమంలో వెంకటాపురం క్రాస్ రోడ్ వద్ద మద్యం మత్తులో సిమెంట్ దిమ్మెలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతనికి గాయాలు అయ్యాయి. హైవే పోలీసులు అతన్ని అద్దంకి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.