ప్రకాశం: యర్రగొండపాలెం పట్టణంలో గుంతలమయమైన త్రిపురాంతకం రోడ్డుకు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు రూ.1.50లక్షల సొంత నిధులతో మంగళవారం మరమ్మతులను చేయించారు. టీడీపీ నాయకులు దగ్గర ఉండి గుంతలు పూడిపించారు. ఈ రోడ్డు ద్వారా ప్రయాణిస్తున్న వేలాది వాహనదారులకు ఉపశమనం లభించిందని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.