NLR: గూడూరు పట్టణంలోని వెంకటగిరి-రాపూరు మినీ బైపాస్ రోడ్డు మరమ్మతులను వెంటనే చేపట్టాలని గుంతల్లో ట్రాక్టర్ ఉంచి బుధవారం వినూత్నంగా నిరసన తెలిపారు. సీపీఎం నాయకులు జోగి శివకుమార్ మాట్లాడుతూ.. గూడూరు రెండో అండర్ బ్రిడ్జి నుంచి సీవీజీ బార్ వరకూ రోడ్డు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు పామంజి మణి, సురేశ్ పాల్గొన్నారు.