NDL: ప్రజలు గ్యాస్ సిలిండర్ కోసం బుక్ చేసి వారం రోజులు అవుతున్నా అందడం లేదని నంద్యాల జిల్లా ఏపీ మహిళ సమాఖ్య జిల్లా కార్యదర్శి రజితమ్మ అన్నారు. నందికొట్కూరులో మాట్లాడుతూ..హెచ్.పీ గ్యాస్ బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు వారం రోజులైనా సిలిండర్ అందకపోవడంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన చేస్తామన్నారు.