SKLM: కంచిలి మండలం డోలగోవిందపురం ZPH పాఠశాలలో ఈనెల 21వ తేదీన అయోడిన్ లోపం నివారణ అనే అంశంపై వ్యాసరచన పోటీలు విద్యార్థులకు నిర్వహించినట్లు హెచ్ఎం ఉప్పాడ రమేష్ తెలిపారు. 9వ తరగతి విద్యార్థి ఎం.రోహిణి, 8వ తరగతి విద్యార్థిని జే.ఉమా మాధురికి ప్రథమ, ద్వితీయ స్థానాలు లభించాయని అన్నారు. డీఈఓ కార్యాలయం నుంచి వచ్చిన ప్రశంసా పత్రాలు బుధవారం అందించామన్నారు.