ATP: బ్రహ్మం గారి మఠం మండలంలోని పాపిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన వీర జవాన్ కొడవటి కంటి రాజేష్ చిత్రపటానికి మైదుకూరు నియోజకవర్గం శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ పూలమాల వేసి నివాళులర్పించారు. వీర జవాన్ కొడవటి కంటి రాజేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం నుండి రావలసిన బెనిఫిట్స్ పై త్వరలోనే ముఖ్యమంత్రితో చర్చించి అందజేస్తామన్నారు.