కృష్ణా: విస్సన్నపేట మండలం నరసాపురంలో రైతు సేవ కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు మంగళవారం ప్రారంభించారు. మండల వ్యవసాయాధికారి రాజ్యలక్ష్మీ మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మారపోగు నాగమణి, గ్రామ రెవెన్యూ అధికారి కాంతారావు, గ్రామ వ్యవసాయ సహాయకులు ఉషారాణి, రైతులు పాల్గొన్నారు.